Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/791

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


దేవదాసినిఁగా చేసిన కథ - ఈ కథలోనే

    “దేవదాసిరూపంతో -స్వయంగాను అభినయిస్తు”
     .. . . . స్తనవల్కల వసనమ్ములు - కడు రమణీయముగ దాల్చి॥
     . . . . . సర్వజనుల స్త్రీ పురుషుల- నందరినీ కొంతవఱకు
     తన వలెనే స్త్రీలజేస్తు - రజోభావ రాధికలుగ
     కృష్ణ భుజింగికల వోలె - భిన్నభిన్న గోపికలుగ
     పరివర్తనచేయటమ్ము...”

అను వర్ణనములో శ్రీ సోమయాజులుగారు “రజోభావరాధికలు” అనుటలోని సారస్యమును సహృదయరసికులు గమనింపఁగలరు. మఱియు గోపికలు “కృష్ణభుజింగికలవోలె” అనుటయు, ఆ గానమునకు గోపికలు పెంటి నాగుబాములవలె ఆనందమున మునింగిరి అనుట సామాన్యము. కాని 'విటుఁడు, నాయకుఁడు' అను అర్ధము నిచ్చు భుజంగ శబ్దమును గ్రహించి "కృష్ణుఁడుభుజంగుఁడుగాఁగలవారు” అను బహువ్రీహిని ఆశ్రయించినచో పఠితలు ఆ గోపికాకృష్ణుల చిత్రములను తమ మనఃపటములపై దర్శింతురు. ఇట్టి దాసుగారు "స్త్రీపురుషుల నందరినీ... తనవలెనే స్త్రీలజేస్తు" అను వాక్యమును చదువగానే శ్రీ వేదము వేంకటరాయశాస్త్రిగారు ఆముక్తమాల్యద పీఠికలో వ్రాసిన

    "గోవిందనందతనయా చ వపుఃశ్రియా చ
     మాస్మిన్ నృపే కురుత కామాధియం తరుణ్యః
     అస్త్రీకరోతి జగతాం విజయే స్మరః స్త్రీః
     ఇనః పునరనేన విధీయతే స్త్రీ”

(ఈ శ్లోకముగుర్తుకు వచ్చుచున్నది అనఁగా పురుష మూర్తి అయిన దాసుగారు వేషమును ధరించినపుడు పురుషులను మోహింపఁజేయగలట్లు తోఁచుట వారి వేషరచనలోని నైపుణ్యము అనవచ్చును. కాని స్త్రీలను సైతము మోహింపజేయుట యెట్లనిపించును. స్త్రీలకు అమూర్తి స్త్రీవేషధారిణి అని కనఁబడుచున్నను "దాసుగారు పురుషుండే" అను భావము వారి మనస్సులకు బాగుగాఁ దెలియు చున్నది కాఁబట్టి వారికి స్త్రీ వేషములో పురుష మూర్తియే మోహజనకముగా గనఁబడినట్లు మన మూహింపవలసియున్నది. ఉపాయనలు 791

_______________________________________________________________________________

ఉపాయనలు

791