దిక్సూచి
వట్టివల్లి మల్లినాథ శర్మ-
శ్రీ శివాయ గురవే నమః
"ధారుణి నారాయణుఁడై
శారదనారాయణకథ శం, భో యనఁగా
నా రవము వినిన నలువ ప్ర
సారించిన నభయకర మొసంగుత సుఖముల్”
“శ్రీమ దజ్జాడ ఆదిభట్ట నారాయణదాసుగారు శ్రీ శారదావతార మూర్తులు హరికథా పితామహులు" అను పలుకును విన్నను, ఎచటనైనను చదివినను, ఛాయా చిత్రములలో వారి మూర్తిని ఒక్కసారి చూచినను వీరికి, పై రెండు విశేషణములేనా, ఇంకను ఉన్నవా! అను విషయములను దెలిసికొన వలయు నను జిజ్ఞాస సహృదయుల హృదయములలో వెంటనే కలుగును. ఆ మూర్తిస్ఫూర్తి అట్టిది. శ్రీ దాసుగారినిఁ గూర్చిన చిత్రలు, విశేషములు పలు విధములు. అవి యన్నియు జిజ్ఞాసువులకు ఒక పుస్తకమునందే దొరకవు. ఎందఱు ఎన్ని విధాలుగా ఎన్ని అంశములు వారినిఁగూర్చి వ్రాసినను లేక ఉపన్యసించినను పుస్తక రూపమున ముద్రించుచున్నను అవి అన్నియు అసమగ్రములే అనిపించుట జగమెఱిఁగిన సత్యము. - అయినను 'సంస్కృతి సమితి చీరాల' 1967 ఏప్రియలులో ప్రకటించిన "హరికథాపితా మహ. శ్రీమదజ్జాడ ఆదిభట్ట నారాయణదాస జయంత్యుత్సవ సంచిక"లో దాదాపు 70 మంది సకలకలానిష్ణాతులైన పండితులు శ్రీ దాసుగారి జీవితచరిత్ర సంగ్రహము, వారి సర్వంకషా పాండితినిఁ గూర్చిన విశేషములు వ్యాసరూపములలో, బ్రకటించియున్నారు. ఈ సంచిక శ్రీ దాసుగారి చరిత్ర సర్వస్వముగా నున్నది. ఒక్క హరికథకులు, గాయకులే కాదు. వివిధ శాస్త్ర పండితులును దానిని జదుపవలసినదే. మఱియు, నెల్లూరు వాస్తవ్యులు, శ్రీ వాడరేవు సీతారామాంజనేయ భాగవతులు రచించిన "హరికథావాఙ్మయము”లోను పండితులు. విద్వాన్ శ్రీ వేదము చంద్రశేఖరయ్య ________________________________________________________________________________
778
వావిలాల సోమయాజులు సాహిత్యం-1