Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/770

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆమె మూలముగను తనదు
జన్మరహస్యాన్ని తెలియ
జేసెడు నా స్వయంలేఖ
నాన్ని లిఖింపగజేసిరి.”

(ఉపాయనాలు:పుటలు)

ఆ స్వయంలేఖానాన్ని ఆ తరువాత కొన్ని సంవత్సరాలకు శ్రీ కఱ్ఱా ఈశ్వరరావుగారు 'భట్టు - విద్యలకే భట్టు ఆది భట్టు- నారాయణదాసు' అన్న పేరుతో ఒక గ్రంథంగా అచ్చు వేయించారు.

ఈస్వయంలేఖన ప్రక్రియను గూర్చి ప్రముఖులనేకులు చర్చించారు. కొందరు దీన్ని విశ్వసించారు. కొందరు విశ్వసించలేదు. కొందరు అవైదికమన్నారు.

ఈ స్వయంలేఖనంలో శ్రీ దాసుగారు తమను శారదావతారంగా ప్రకటించుకొన్నారు. పెద్దలనేకులు ఈ అంశాన్ని విశ్వసించి ధృవీకరించారు. ఆయా రంగాల్లో నిష్ణాతులైన ప్రసిద్ధ పండితులనేకులు, శ్రీ దాసుగారి సాహిత్యపాండిత్యాన్ని, కవనవైశిష్ట్యాన్ని, గానవైదుష్యాన్ని, నృత్యనిష్ణాతృత్వాన్ని, ఆయన అవతారవైభవాన్ని పలురీతుల ప్రశంసించి, నివాళులర్పించారు. ఇవన్నీ 'భట్టు - విద్యలకే భట్టు ఆదిభట్టు - నారాయణదాసు' అనే ఈ స్వయంలేఖన గ్రంథంలో చోటు చేసికొన్నాయి.

ఆ సందర్భంలో చేయబడ్డ రచన ఈ 'ఉపాయనాలు'. ఇది సుదీర్ఘంగా ఉండటంచేత ఇందులో ఎనిమిది పేజీలు మాత్రం పైన పేర్కొన్న గ్రంథంలో అచ్చువేసి, ఈ 'ఉపాయనా'లను ప్రత్యేక గ్రంథంగా ప్రకటించే సంకల్పాన్ని అందులో వెల్లడించారు. శ్రీ ఈశ్వరరావుగారు. ఆ సంకల్పం ఇప్పటి కిలా కార్యరూపం ధరించింది.

ఆ స్వయంలేఖనంలో సాక్షాత్కరించిన పుంభావసరస్వతి వీక్షాప్రసారం గూడా ఈ కృత్యావిర్భావానికి లభించినట్లే గదా!

శ్రీ వావిలాల సోమయాజులుగారు బహు సహస్ర సంఖ్యాకంగా ఏకలవ్య శిష్యసంతతిని సమకూర్చుకొన్న గురుపీఠ సమధిష్ఠితులు. మూడు దశాబ్దుల క్రిందటివరకు ఇంటర్మీడియెట్, డిగ్రీతరగతుల్లో చదువుకొనే విద్యార్థులలో తెలుగు భాషాపరీక్షకు వారు వ్రాసిన నోట్సులు చదువనివారు లేరంటే అతిశయోక్తికాదు. ఆ నోట్సులో ఆయా ప్రశ్నలకు వారు వ్రాసిన సమాధానాలు పరీక్షదృష్ట్యా తేలికగా ముక్కునపెట్టుకోటానికే ఉద్దేశించిన చౌకబారు సమాధానాలు కావు. అవి సాహిత్యదృష్ట్యా


____________________________________________________________________________

770

వావిలాల సోమయాజులు సాహిత్యం - 1