Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/766

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అవతరించిందేమో వాగ్దేవి ధరించిందేమో 'నారాయణ' నామం! ఇందేమి ఔచిత్యం ఉన్నది? ఉన్నదని విద్యావారథులైన శ్రీ వావిలాలవారు వెల్లడిస్తున్నారు.

.............శబ్దమ్ములు
ఎవని వలన బయలుదేరు
అతడు 'రాయణుండు' అతడు
గానివాడు 'అరాయణుండు”
అరాయణుండు గానివాడు
'నారాయణు' డందుచేత
తనవలననె శబ్దమ్ములు
బయలు వెడలు చుంట వలన

'నారాయణు' డయ్యె

(ఉపాయనాలు పుటలు)

నారాయణ శబ్దం వాగ్దేవికి కూడా అన్వయిస్తుందన్న మాటే కదా!

ఇలా పొడిమాటలతో వాచ్యం చెయ్యటం వావిలాలవారి పద్దతి కాదు. వారీ విషయాన్ని వివరించిన తీరుసౌరు గమనించండి.

'దేవదాసి ఒకతెకు ఆ
దీక్షాగుణ లక్షణాన్ని
అవసరమౌ జ్ఞానమ్మును
అభినయ సంక్లిష్టతలను
నాట్య గాన క్లేశాలను
అవగతమ్ము గావింపగ
అభ్యర్థన చేసినపుడు
దృఢతర సద్భావనతో
శిష్యురాలిపై ప్రేమతో
దేవదాసి రూపంతో
స్వయంగాను అభినయిస్తు
చూపి నేర్పగా - వలె నని
.............….........

___________________________________________________________________________________

766

వావిలాల సోమయాజులు సాహిత్యం - 1