Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/760

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

స్మృతిపథంలో ఒక వెలుగు వెలిగినట్టుగా, నాకు అత్యంత సన్నిహితుడు, ప్రియమిత్రుడు, అయిన ఒక వణిక్ ప్రముఖుడు మెరిసినాడు. ఆయన హిందూకళాశాలలో శ్రీ వావిలాలవారి శిష్యులు, భక్తులు, వారి ఉపన్యాసధోరణికి ముగ్ధులై, నాతో పదేపదే చెప్పుతుండేవారు. వారిని కోరగా అలాగే అని దీని ముద్రణభారము వహించి నా పనిని తేలిక చేసినందుకు వారికి నా కృతజ్ఞత తెలియచేయు చున్నాను.

ఈవిధంగా ఇంతమంది సహకారంతో ఈ గేయ ప్రబంధం వెలువడి, దాసభారతికి, సాహిత్య సరస్వతికి తలలో ఒక పుష్పముగా వెలుగొంది, పాఠకులు దీనిని ఆదరించి స్వీకరిస్తా రని నమ్ముతూ ఈ ప్రస్తావన ఇంతటితో ముగిస్తున్నాను.

బుధజన విధేయుడు

కఱ్ఱా ఈశ్వరరావు

(దాసభారతీ ప్రచురణ కర్త)

___________________________________________________________________________________

760

వావిలాల సోమయాజులు సాహిత్యం - 1