తే. అఖిల సంస్కృతి దుఃఖమ్ములందు జన్మ జన్మలను జీవితము నాకు సహచరియగు అర్థి పావనప్రత్యూష మగునుగాక ! అలస సుఖమున మేల్కొల్పు లగుత నీకు !! తే. జగదపావన కలుషము సర్వ మింక నీదు వైదగ్ధ్యమును బొంది నెగడుగాత! ఇలను మరల నిర్మలత శోభిల్లుగాత !! ఇట్టి పాపము పుణ్యమై యెసఁగుఁగాత!! తే. స్వప్నముల సుఖచ్ఛాయలో సంస్కృతి కడు గాఢ తంద్రాలసమ్మయి కడఁగు వేళ నిటుల జాగృతవై వచ్చి తెవరు నీవు? మించి నామది నున్న విస్మృతివె నీవు? తే. ఔను నీవు దానివె-మామ కాత్త దుఃఖ " పూరిత విదగ్ధ హృదయాన పుట్టి యెపుడు నెగడు చిరజీవిత సుసంగినివె యగుదువు శుభ్రవేదనా! ఓసి అశ్రుమయ వర్ణ!! తే. స్వైర కుట్మల కిసలయచ్ఛలములోన నేను మరచిపోయినపుడు నిన్ను, నీవు విమల కుహుకుహూ నిస్వన వేదనముగ వచ్చితివి రంగభూమికి వనిత ! నీవు. తే. తెలియఁగాఁ జెప్పు మెదను సందేహపడకు శూన్య గగనాన నీవేమి చూచినావు ? నెలఁత! రజనీ మనోహర నిర్జనమున పథము నెంత నీవు నడచివచ్చినావు. తే. స్వప్నకల్పన చణఋక్ష సముదయముల 746 అభినయపు మాయ సాగెడు నపుడు సౌఖ్య హృదయకోణమందున తిమిరేద్ద నీల కాంతి పర్వి యంతట దానిఁ గప్పుచుండె. 175 176 177 178 179 180 181 వావిలాల సోమయాజులు సాహిత్యం-1
పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/746
స్వరూపం