Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/744

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

తే. జీవితసకల కల్పనా స్నిగ్ధతలను నేత్రతారా కిరణ రుచి నిచయములను, బహుతరాలోక మంజు ప్రవాహమునకు నెలమి ప్రతినిధిగ నభిషేకించుగాక! తే. అఖిల మీ వేదన మధుర మౌను గాక! నా దయారహితమగు తన్మయత నేఁడు గాటముగ నెదతోడఁ దాఁ గలయుగాక! నేనును సహృదయతను పొందెదను గాక!! 161 162 తే. నా అనామసంగిని!.. కలకఠోర కోమలత! ఇరువుర మెదఁగోరి జీవి తాధ్వమున పయనించు చనంతకాల హృదయ సఖులమై యుండిపోవుదము తెలియ! 163 తే. ఎన్ని యా తారకలరాత్రు - లెన్నిదినము లెన్ని గడియలు - మదినెపుడెన్నరాని యట్టి మోహరహిత సమయ వలయమ్ము లెన్ని విస్తృతిని గడచి యేగినవియె! తే. మానసోద్వేల్లిత తరల మహిత వీచి కాళి తాను తిరిగిరాదు - జౌను ఆయ | సంతకోణమును దరిసి స్నానమొనర నది నిజమ్ముగఁ జేయించి యరుగుదెంచు. తే. నేత్రముల కోణములు దేనిని దమిఁదాకి నింపుకొని తెచ్చు నిర్మల నీర చయము నట్టి చలువకై దప్పి గొన్నట్టి దీన భావ కరుణార్ధ రసపత్ర పాత్రలగును. 164 165 166 తే. పొలసి యెయ్యవి నిద్రించుఁ బులకి తమ్ము 744 లైన యట్టి సుఖచ్ఛాయలందు మసృణ ములయి ఆ హృదయోచ్ఛ్వాసములు కడంగి మరల మేల్కొను నామధు మాయ యందు. 167 వావిలాల సోమయాజులు సాహిత్యం-1