Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/740

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

తే. తే. తే. ఆ విమలహాసమును నిట్టి యశ్రువులను గనక సురుచిర గతులతోఁ గలియనిమ్ము అర్థి రానిమ్ము నవ్య వర్షాగమమును చెలఁగఁ గళికలన్నియు వికసింపనిమ్ము. అఖిల జగతీఘనోన్నిద్ర వ్యథలయందుఁ గణకణమునుండి యేరుకోఁ గడఁగుమీవు చారు సమ్మోహన జనరంజక కథాళిఁ జెప్పికొనుటకు మిగులుచుఁ జెలఁగనిమ్ము. అతి వినీల మంజుల త్రియామాంచలమున నలసి శీతకరుఁడు నిద్రనందు వేళఁ జరమగిరి లోయవంకకు నరిగి యంత దినకరుండును గనఁగ సదృశ్యుఁడయ్యె. తే. రమ్య జలద మనోజ్ఞ కారాగృహాన హ్రాదినీ లత తా బందియైన యపుడు స్వర్గ గంగా స్రవంతి నక్షత్రపాళి మునిఁగిపోవుచునుండె నపూర్వముగను. తే. అయ్యెడను దాల్చి మణిదీప మనెడి విశ్వ మందిరపు కిరణ మసృణమాల నాదు జ్వాల లౌ నీవు తన్విరో! పరగి యొంట రిగ జ్వలించుచు నున్నావు క్రీడ మెరసి. తే. లీల నుత్తాల జలనిధి వేల లందు నెత్తికొని శిరశ్శైల మునెసఁగి, అర్థి మెయిని నిస్తబ్ధ గగన భూమీతలాన బహుళ హృదయాగ్ని నొగిగ గుప్తమ్మొనర్చి. 133 134 135 136 137 138 తే. నియతి సంకేతమును బొంది నిండుతమము 740 లోన బ్రతుకును జిక్కుల నూనఁ జేసి చంచలోజ్జ్వల చికుర పాశమును విప్పి గహనగుహయందు నిద్రలో గడపువేళ. 139 వావిలాల సోమయాజులు సాహిత్యం-1