తే. నీ నభోంగణ మందు వినీల శయ్య యందు నుపవిష్టయై కరుణాబ్దమటుల విస్తృతిని వినీల నళిన విమల రసము తే. తే. కురియుమా తన్వి యెయ్యెడ కొసరి కొసరి. చిర విదగ్ధ దుఃఖితమైన స్థిరయిపుడును గోరుచున్నది యాలోకసార, మిప్పు డైన నున్మత్త యిది నిద్రనంద కణము 126 కణముగఁ గురియు మదియె చీఁకటిహిమమ్ము. 127 ఎనసి సంప్రీతిఁ గురియు విస్తృతి సమాధి పయినఁ గళ్యాణ మోహన వారిదమ్ము నెగడు నాసుఖ మలసి తా నిద్రవోవు అంత వదలిపోవును విపచ్చింత తివిరి. తే. చేతనాలహరి కనదు జృంభణమును జీవిత జలధి నిలచును స్థిరతవడసి పరగ సర్గప్రళయ సంధ్య ప్రభవమొందు నొదవు మరల వియోగ సంయోగములును. తే. రమ్య రజనీమతల్లి నేత్రములు జార్చుఁ బృథులముగ నిత్య మాలోక బిందువులను అంధతామిశ్ర కుహనాంగ నాళి వానిఁ ద్రావుచుండు నిశ్శబ్దతా తంద్రతలను. తే. నిన్ను సుఖ మవమానించుచున్న యట్లు వ్యంగ్యపూరిత హాసమ్ము నాచరింప నీవు మౌనముగ నెద రోదింప వలదు ఇదియు పృథుపరవశతయై యెసక మెసఁగు. తే. ఏల నీదు కన్నీటి దోయిలిని నేత్ర యుగళినె నినిచి యిటు త్రావుచుంటి వీవు? గగనతారకలు పతన కాలమందు వెలసి యుజ్ఞ్యల ఫణితి జీవించుచుండు. 128 129 130 131 132 కన్నీరు 739
పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/739
స్వరూపం