తే. హరిత విషపాత్ర నయనములందుఁ జేర మదిరయై మనోజ్ఞారుణిమముల వెలిఁగె చక్షు సుందర ముగ్ద పక్ష్మములు నేఁడు జీవితమ్మున ప్రణయమై చెలఁగుచుండె. తే. కామనాసింధు వీచికాగతుల నొప్పి నిత్యసౌందర్య పూర్ణిమ నిండియుండె అస్మదీయ విధుచ్ఛాయ యమల ఫణితి మించి రత్నాకరమ్మయి మెరయుచుండె. తే. పరగి సౌందర్య యవనికా భ్యంతరమున నిచ్చ మోహన మురళి మ్రోయించుచుండె అపుడు ఛాయానటుండు వస్త్రాంచలమున సంధ్య, కుహన, కౌతుకమొంది సాగిపోయె. తే. వచ్చితివి మాదకత్వమ్ము పగిది నీవు చనెడివేళ వెడలితివి సంజ్ఞవోలె వదలి పోయిన మత్తులో వ్యాకులతను విలపనము సేసినాడ నవ్వేళ నేను. తే. అవధి నెఱుఁగనిదగు నంబరాంతరమున బహుళ చంచల చపలవైవచ్చి వెడలి మఘవ చాపోప మమ్మైన మహితకాంతి వదలితివి తన్వి! బహుళముగను. తే. ఆస్మృతి కుసుమ రస జలదాళి మాల పగిది కైపున వేవేగ వచ్చెనపుడు ఈ హృదయ విపిన కళిక యిటుల దాని రసముచే స్మిత మొగి నొనర్పంగ సాగె. తే. శిశిరకణపూరిత మ్మయి చెలఁగె నెడఁద నీదు సమ్మోహన కుముదినీ ప్రియుండు కడఁగి మధువర్షమటు మౌక్తికముల రాశి నిదె మనోమందిరముపై వర్షించుచుండె. కన్నీరు 70 71 22 72 73 H4 74 75 76 731
పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/731
స్వరూపం