తే. నీదు పక్ష్మతూలిక మహోన్మేషమునను క్షితిజపటము నిటుల నంకితమ్మెనర్చి యెన్ని క్షతహృదయముల కహీనచతుర చిత్రకారిణి యౌచుఁదాఁ జెలఁగుచుండె. తే. కోమల కపోలములను నిగూఢ మంజు స్మితి సురేఖను, భ్రుకుటి వక్రతను నెవఁడు దర్శనము సేయునో గాఢ తత్పరతను నిలపయిని వాఁడె కౌటిల్య మెఱుఁగగలఁడు. తే. ఇంపు లొలయు విద్రుమ శుక్తి సంపుటమున నిటుల ముత్తియపుం గింజ లేల తోఁచు? హాఘ మీది కాదు శుకమె యౌ, అరుగుదెంచె నేల యీ ముత్యములను భక్షించుకొఱకు. తే. బహు వికసిత జలజ వన వైభవమ్ము మించెడి మధురోషస్సు నిజాంచలమునఁ గెరలు నాహాసమును దిలకించి క్షణము తనను నపహాస మొనరించుకొనును దానె. తే. ఆననాబ్జ సమీపమ్మునందు భవ్య పంకరుహ ముగ్ధ కిసలయ ద్వయము గలదు శ్రవణముల యందు జలబిందు సదృశముగను నెవరి దుఃఖము నిలచి తా నిటుల నుండె. తే. ఏ యనంగుని సమ్మోహ నేద్ద చాప శిథిలతా ద్విగుణీకృత శింజిని యది! అది యనంతతన్వీ సుభుజాబ్జ లతయె! రమ్య నవ తనుచ్చవి సరోలహరి యౌనె? తే. చంద్రికాపర్వ సుషమల జలకమాడి చంచలాతన్వి వచ్చిన సరణి నుండె రమ్య మా పావనవపు ర్విలాసశోభ అమరె నాలోక మధురయై అక్కజముగ. కన్నీరు 42 43 44 45 46 47 48 727
పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/727
స్వరూపం