Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/724

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

తే. ఏడ్చి యేడ్చి నే నంతట నేకువెట్టి కరుణకథ నీకు వినిపింపఁ గడఁగినాను సుమనముల గిల్లుచును వినుచుంటి వీవు ఎఱిగి యెఱుఁగని యట్లు వర్తింతువేల? తే.. మించెడి విమోహమునను విస్మృతిని జెంది పడుచు లేచుచు సాగుచు వెడలుచుంటి చి త్తవీథి వీణాశ్రుతుల్ సేయఁబడియె తివిరె నా యనురక్తి సుతీక్షణముగ. తే. పొలసె జంఝానిలోద్ధతా స్ఫోటనమ్ము మహితగర్జ శంపామేఘ మాలికాళి చూచి, పొంది సమస్త మీశూన్య హృదయ మునను వాసమ్ము కల్పించుకొనియె నపుడు. తే. ప్రళయ జలదాళి నా కుటీరమును ధరిసి పూర్ణగర్జలఁ బైఁబడి ముట్టడించె శుభ్ర గతి కురిసెను తమశ్చూర్ణ-మంత నంధ తమసమ్ము క్రమ్మె నత్యధిక మగుచు. తే. మహిత విద్యుల్లతా మంజు మాలికల ధ రించి, సుస్మిత మొనర్చెడి రీతి, నాదు స్వాంతమున ఘనరసబిందు సముదయమ్ము నెవ్వ రాగక మరల వర్షించినారు? తే. అస్మదీయ మిథ్యాజగమందు నున్న నిత్యసుందర మోహన సత్య మీవు మధుర కళ్యాణకలిత మీ మార్గమందు నాకు జీవన-సంగవై యొప్పినావు. తే. రజ్య దుజ్వల చిరరహోరాత్రు లెన్నో నమల మందాకినీ ప్రవాహమ్ము లోన దివ్యతారామనోహర దీపికాళి నిచ్చి యుపహారములుగ నర్చించినాను. 21 22 23 24 25 26 27 724 వావిలాల సోమయాజులు సాహిత్యం-1