Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/721

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కన్నీరు (ఆంసూ) తే. ఏల కరుణరసకలిత హృదయ వీథి నిటుల వికల రాగిణి ధ్వనియించు నేఁడు ఏల హాహారవాల గర్జించు నీటుల స్నిగ్ధవేదన చెలఁగి నిస్సీమ మగును? తే. తే. తత మదీయ మానస రహస్తటము నందుఁ గలిత లోలలహరి కాఘాత పంక్తి? ఏల కలరవమ్ముల వినిపించుఁ గొలఁది బహుళ విస్తృత గత పూర్వ వచనములను? నా ప్రతిరుతి ప్రత్యావర్త నమ్ము నేల సలుపు నిటు శూన్యమౌ క్షితిజమ్ము నుండి? ఎదురు దెబ్బ తిన్నటు, విలపించు దాని వోలె నున్మత్తయటు రాకపోక లేల? తే. అర్థిఁ జింతించుచును నుభయాంచలముల వ్యథిత గగన కూలంకష పగిది నేఁడు మామకీన సుచేతనా మహిత తటి ని మృదుతరంగ పాళికల సృజించు నేల? తే. నీల నభమున తారకానిచయ మెనసి వ్యాప్తిఁ గైకొని వర్తిలు పగిది మదిని వెలయ నిర్మింపఁబడియె సువిస్తృతముగ బహుళ సంకీర్ణమౌ జనపద మొకండు. తే. ఇట్టి జ్వాలామయాగ్నియం దెగసి పడెడి కన్నీరు యఖిల మీది నాడు విస్ఫులింగాళి, అరయ నిద్దిశీర్ణమై కనఁ గేల శేషమగుచు చెలఁగు నా మహామేలన చిహ్న వితతి. 1 2 3 4 10 5 6 721