Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/718

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఇక తనలోని శుభ్రవేదనను (నిశ్చల ప్రేమ - జనితమగు) తన జీవిత చిరసహచారిణిగ నంగీకరించి అట్టి చిరసహచరి సహవాసము వలన ఆమెయశ్రు వులతో బాటుగ ఆమె ప్రేమను గూడ తనకు ప్రాప్తించినదని పల్కుచు, తనలోని వేదనను మఱియు అశ్రువులకునుగల విడదీయరాని సంబంధమును వెల్లడించుచు బాబూజయశంకరప్రసాద్ ఇట్లు వ్రాసినాడు. మూలము : "తుమ్! ఆ రే వహీహాఁ తుమ్ హెరా మేరీ చిరజీవనసంగిని దుఃఖవాలేదగ్ధ హృదయకీ వేదనే ! అశ్రుమయిరంగిని తే. "ఔను నీవు దానివె - మామకాత్త దుఃఖ పూరిత విదగ్ధ హృదయాన పుట్టియెపుడు నెగడు చిరజీవిత సుసంగినివె యగుదువు శుభ్రవేదనా ! ఓసి అశ్రుమయవర్ణ ॥ ఇక చివఱగ, తన కన్నులను నిచ్చలుక్రమ్మియుండు అశ్రువుల, తన వలె దుఃఖసంతప్తమైన జనుల హృదయములను, ప్రాతఃకాలీన తుషార బిందువులు, శు ష్కమైన ధరతిపై వర్షించి, అర్ధమొనరించిన చందమున స్నేహార్ధములను కరుణ సంభృతములను గావించుచు, మానవత, మోముపై ఆనందముచే తరళమైన మందస్మితము గోచరించుదనుక, కన్నులనుండి సతతము వర్షించుచునే యుండుగాక, యని కవి యాశ్వాసించుచు ఈ కావ్యమును ముగించినాడు. కవితాత్పర్యమేమియన లోకమునందు సుఖ-దుఃఖములు సామరస్యమును నెలకొల్పుటకై కరుణ వేదనలు, రెండూ అనివార్యములు. ఇదియే స్వ- జయశంకరప్రసాదు జీవిత దర్శనము. 'ఆంసూ' అనే కావ్యంలోనే గాక 'కామాయని'లో గూడ, తన యీ మతమునే నిర్ద్వంద్వముగ ప్రకటించియున్నాడు. ఈ విషయమునే వర్ణించుచు బాబూ జయశంకర ప్రసాద్, తన సందేశాన్ని ఇలా ఇస్తాడు :- మూలం 'సబ్కా, నిచోడ్, లేకర్ సుఖసే సూఖే జీవనమేఁ బరసో ప్రభాతహిమ - కనసా ఆంసూ ఇస్ విశ్వ సదనమేఁ ॥ 718 వావిలాల సోమయాజులు సాహిత్యం-1