ఇక కవి ఈలోకంలో అన్నీ కష్టాలే అని చెప్తూ ఇలా అంటాడు : పైన శూన్యమైన ఆకాశంలో నియతిసర్వసుఖాల్ని నింపింది. అందుకు చిహ్నంగా నింగిలో నక్షత్రములు, మిలమిలలాడుతు అనంతముగ వ్యాపించి ఉన్నాయి. ఇక క్రింద భూమి ఉన్నది. ఆ భూదేవి అన్ని కష్టాలను భరిస్తూ తన క్షారములగు అశ్రు వులతో సముద్రాన్ని నింపుతున్నది. ఇక్కడకవి తాత్పర్యము : తన ప్రియురాలు చీకు చింతలేని హృదయ సీమలో సుఖంగా ఉంది. కాని తానుమాత్రం ఈ భౌతిక జగముననే రమిస్తూ అష్టకష్టాలూ పడ్తూ ఉన్నాడు (ఆంసూ, ప. 108, 109) ఇంక ప్రసాద్, తన వేదన, మేఘమాలయై అనంతగగనంలో, సుఖ దుఃఖాల స్పర్శ గూడ తగలకుండగ హాయిగ స్వచ్ఛందంగా చరించాలని ఆకాంక్షిస్తాడు. ఇది నిరంతర సాహచర్యము వల్ల దానితో అతనికి విడదీయరాని మమత ఏర్పడింది. అతని జీవితము వేదనామయమే ఐపోయింది. ఈ క్రింది పంక్తులను చూడుడు : మూలము : తెలుగు “ఛడ్ జాయ్ అనంత గగనపర్, వేదనా జలద కీ మూలా | రవితీవ్ర తాప, న జలాయే, హిమకర కాహెూ, న ఉజాలా॥ తే. "అపరిమేయ నభముపై వ్యథాభ్రమాల, యధి వసించుత - తాపాగ్ని నర్యముండు కోరి జ్వలియింప కుండుతఁగుముద బంధు వృజ్జ్వల ద్యుతి విన్నవోకుండుగాత।। (ఇక్కడ రవి - హిమకరులు, సంతాపమునకు - శీతలతకును అనగా దుఃఖ సుఖములకు ప్రతీకములు. కవి తన జీవిత వేదనను పదునాల్గు భువనాలలోనికి పంపినా, ఎక్కడా శాంతంగా నిల్చిపోవడానికి తావులభించక తిరిగి కవి జీవిత ప్రాంగణానికే వచ్చి స్థిరమైన ఆవాసం ఏర్పాటు చేసికొని స్థిరపడ్తుంది. తన జీవితం వేదనామయం అని తెల్పటానికి కవి చమత్కృతి జనకమగు ఈ వ్యంగ్యశైలినిట ప్రయోగించినాడు :- కన్నీరు 715
పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/715
స్వరూపం