Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/712

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

మున్గియుండుటే. ఈ ప్రియతమోపేక్షా జనితమైన వ్యథను కవికావ్యారంభంలోనే ఇట్లా వెళ్లపోసికొంటాడు. మూలము "రో- రోకర్, సిసక్ - సిసక్ కర్

"రో-రోకర్,

కహతామైఁ కరుణకహానీ, తుమ్ సుమన నోచతే సునతే కరీ జానే అనజానీ ॥ తే. "ఏడ్చి యేడ్చి నేనంతట నెకువెట్టి కరుణ కథ నీకు విన్పింపగడగినాను సుమనములు గిల్లుచును వినుచుంటి వీవు ఎఱిగియును ఎఱుగనియట్లు వర్తింతు వేల (తన ప్రియురాలు పూలు కోసికొనుటకు వచ్చినపుడు తన కరుణకథను విన్పించినను, ఆమె ఏమియును పట్టించుకొనక, తన పూలు తాను కోసికొని వెళ్లిపోయెడిది. ఇంక తన జీవితములో తన ప్రియతముని ప్రవేశనిర్గమనముల వలన తనలో కల్గిన ప్రతిక్రియను వర్ణించుచు కవి యీ క్రింది ఛందస్సును కూర్చినాడు. మూలము : మాదకతానే ఆయే తుమ్, సంజ్ఞా - సే చలేగయే తుమ్, హమ్ వ్యాకులపడే బిలఖతే థే, ఉతరే హు ఏ నశేసే ॥ (కవి హృదయంలో అతని ప్రియతముడు ప్రవేశించినపుడు అతనిలో నొక విధమైన మాదకత (నిషా) వ్యాపించింది. కాని ఆనిషా తగ్గేలోపల ఆమె నిష్క్రమించింది. దాని వలన నతడు చాల వ్యాకులతతో బిట్టు విలపించినాడు. కాని ప్రయోజనం? (అను) తే. "వచ్చితివి మాదకత్వము పగిదినీవు, చనెడివేళ వెడలితివి సంజ్ఞవోలె! వదలిపోయిన మత్తులో వ్యాకులతను విలపనము సేసినాడ నవ్వేళనేను 712 వావిలాల సోమయాజులు సాహిత్యం-1