మైఁ ఇఠలా ఉఠా అకించన దేఖేజ్యోం స్వప్న సబేరే” “పరిచయ రాకాజలనిధికా జైసే హెూతా హిమకరసే ఊపర్సే కిరణేఁ ఆతీఁ మిలతీహైఁ గలేలహర్సే”
ఈ పద్యములలో ఆయన ప్రేమకాలంబనము, భౌతికవ్యక్తిగాక, ఒక సర్వ వ్యాప్తము, చిరసుందరము ఐన, ఆత్మయను అర్థము, ధ్వనించుచున్నది.
భావార్థము : తాను తన ప్రియదర్శనోత్కంఠతో కలగుడు పడువేళ తన ప్రియుడు, విద్యున్మాలను ధరించి చిఱునవ్వుతో నాపంచలో (హృదయంలో) నే నాకు దర్శనమిచ్చినాడు. అతడు మామీద దివ్యప్రేమ రస బిందువులను కురిపించినాడు.
ఆయానందములో కవి మనస్సులో ఇట్లు తలపోస్తాడు. ఈ జగత్తంతా మిథ్యయే. కాని ఈ మిథ్యా జగత్తులో తన ప్రియతముడొక్కడే సత్యము. జాగతిక సౌందర్యము అశాశ్వతము. కాని తన ప్రియుడు చిరసుందరుడు, కళ్యాణ కలితమైన ఈ ప్రేమ మార్గంలో అతని జీవిత సహచరుడు తన ప్రియతముడు మాత్రమే.
తన ప్రియతముడు ఈ లోకమున కావల చాల ఉన్నత లోకములో నున్నను తనను గూర్చి క్రిందకు దిగివచ్చుట తనకెంత గౌరవము! అతని రాకకు, అకించనుడనైన నేను గర్వంతో పొంగిపోయాను. నిజంగా నా ప్రియతమునితో నా యొక్క మిలనము ప్రాతఃకాల స్వప్నం (సత్యము).
తన ప్రియమిలనప్రసఙ్గమును కవి యిట్లు వర్ణించినాడు. నిండు పున్నమి నాడు చంద్రుడు ఉదయించి, తన స్వచ్ఛములైన సుధామయ కిరణములతో తన రాకచేనుప్పొంగు సముద్ర తరంగములను ఆలింగనము చేసికొనునట్లు
(తెలుగు) :
తే. "మహిత విద్యుల్లతా మంజుమాలికల ధ రించి, స్మిత మొనర్చెడిరీతి, నాదు స్వాంతమున ఘనరసబిందు సముదయమ్ము నెవ్వరాగక మరల వర్షించినారు.