"కాలీ ఆంఖోంమే కిత నే, యౌవనకే మదకీలాలీ, మానిక - మదిరాసే భర్తీ, కిన్నే నీలమ్ కీ ప్యాలే ||
(తెలుగు): తే. 'ఆవినీలా వదాత నేత్రాళి నెంత యౌవన ఘన ఘూర్ణ మధుమదారుణిమము! పరమ మాఘవాసిత వజ్రపాత్ర నెవ్వ రొదవ నింపిరి మాణిక్యమదిరతోడ ! (ప.సం. 40)
కవి, కజ్జల వినీలములగు తన ప్రేయసి నేత్రములలో తనకు అనురాగపు లాలిమను, ఎఱ్ఱని మధువు నింపిన నీలమణి చషకములతో బోల్చినాడు.
ఈ వర్ణనముద్వారా తన ప్రియురాలి అనురాగమును వెదజల్లు దృష్టి పాతముల వలన, తనలో మధుపానము చేసినపుడు కల్గు మాదకత యలము కొనెనని ధ్వనింప చేసినాడు.
కవి వెనుక ఉదహరించిన పద్యములన్నిటిలోనను తన ప్రేయసియొక్క భౌతికమైన శారీర సౌందర్యమును వర్ణించినాడు. కాని దానిపై పూర్తిగ నిలబడక, తిరిగి తన ప్రేమలో ఆధ్యాత్మికతను గూడ రంగరించి కొన్ని ఛందస్సులు వ్రాసినాడు. ఈ క్రింది పద్యములను చూడుడు:-
మూలము
"బిజలీ మాలా పహనే ఫిర్, ముసక్యాతా.. - సా ఆంగన్ మేఁ, ముస్కురాతా - హాఁ కౌన్ బరస్ జాతాథా, రస-బూంద్ హమారే మన మేఁ" "తుమ్ సత్యరహే చిరసున్దర్, మేరే ఇస్ మిథ్యాజగమే, థే కేవల జీవన సజ్జీ కల్యాణ - కలిత ఇస్ మగకే” “గౌరవథా, నీచే ఆయే ప్రియతమ మిలనేకో మేరే,