Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/705

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ముత్తెములవలె స్వచ్ఛముగ ప్రకాశించు దంత పంక్తిని, శుకమును బోలిన సుందరమైన నాసికను వర్ణించి భావుకుల నలరించు ఒక చమత్కారమును నిక్షేపించినాడు:-

ఈ క్రింది పద్యమును చూడుడు:-

మూలము :

"విద్రుమ సీ పీ సంపుట మేఁ మోతీకే దానేకై సే? హై హంస నశుకయహ్ ఫిర్ క్యోం చుగనేకో ముక్తా కైసే?

(తెలుగు) : తే. "ఇంపు బొలయ విద్రుమశుక్తి సంపుటమున నిటుల ముత్తియ పుంగింజ లేల తోఁచు? హఘ మీది కాదు శుకమె యౌ, అరుగుదెంచె నేలనో యీ ముత్యముల భక్షించుకొఱకు. (ప.సం. 44)

అభివ్యంజన విశేషముల వివరణము :

విద్రుమసంపుట' పదముచే పగడమువలె ఎఱ్ఱగానున్న పెదవులు, ఆ సంపుటములోని ముత్తియపుగింజలు అను వాక్యముద్వారా ముత్తియముల వలె స్వచ్ఛంగా ప్రకాశించు ప్రియురాలి యొక్క దంత పంక్తియులక్షితములగుచున్నవి. ముత్యములను హంసలు భక్షించునని కవి సమయము కనుక, తన ప్రేయసి యొక్క నాసిక, ఆ ముత్యములను భక్షించుటకు వచ్చిన హంస యనుటకు వీలులేదు. ఏలయన 'నాసిక'ను హంసతో బోల్చుట కవిసమయ విరుద్ధము. అందుకని, నాసికను, 'శు కముతో పోల్చవలెను. కాని ముత్యములను భక్షించు అలవాటు లేని శుకము (నాసిక) ఈ విద్రుమసంపుటములోని ముత్తియపు గింజల నేల భక్షించుట కిటకు వచ్చినదో అనూహ్యమని పల్కి కవి చమత్కరించినాడు.

కనుక పైన యిచ్చిన ప్రేయసి యొక్క తనులతతో బాటుగ, సుందరములును, కోమలములునైన, అంగకముల సౌందర్యవర్ణనమును దర్శించిన పిదప, ఇది యలౌకిక ప్రేమ వర్ణనము అని ఎవ్వరును అనజాలరు. శ్రీజయశంకర్ ప్రసాద్ తన ప్రేయసి యొక్క నిరుపమ లావణ్యమునే స్పష్టముగ నిట వర్ణించినాడు. అంతేగాదు. అట్టి సందర్యదర్శన జనితమైన ప్రగాఢ ప్రభావమును గూడ ఇక్కడ ఉదహరించబడబోవు పద్యములో స్పష్టముగ వర్ణించినాడు.