గర్జించుచున్నదను ప్రశ్నద్వారా కావ్యము నారంభించు, ఆయసీమ వేదన యొక్క ఉ త్తరోత్తర తీవ్రతను నిరూపించుటకు దొరకొనినట్లు కన్పించును.
ఇక్కడ మనము గమనించవలసిన ముఖ్యవిషయ మేమియన, శ్రీప్రసాద్ ప్రేమ యొక్క యాధ్యాత్మిక పక్షమునకు మూలముగ ఐహిక పక్షమును మున్ముందు ముప్పదినాల్గవ పద్యములో వర్ణించినాడు, కనుక న్యాయముగ ఆ పద్యముతోనే ఈ విరహకావ్యము నారంభించవలసి యుండగ, “ఇస్ కరుణాకలిత హృదయమేఁ' అను పద్యముతో నారంభించుటకు కారణము ఆయన వ్యక్తిగత జీవితరహస్యమేయని మేము ముందుగనే నివేదించియుంటిమి.
కనుక తన జీవితగోధూళి వేళలో తానుగాంచిన నిండు యౌవనమున పొంగారు నొక శశిముఖియగు యువతిని చూచిన పిదప తన మనస్సులో కల్గిన రూపాసక్తిని, ఆనందమును కవి వర్ణించకుండనుండ లేకపోయినాడు. ఈ క్రింది పద్యములను చూడుడు:-
మూలములోని 1) 'మధురాకాముసక్యాతీథీ, (29 పద్యము)2) 'ప్రతిమామే (సజీవతాసీ)' (ప-36), మానాకి రూపసీమా-హై (ప.37) పద్యములను ముందే నాయకునిపై ప్రియారూప దర్శన జనితమైన ప్రగాఢ ప్రభావమును నిరూపించుటకై యుదహరించియుంటిమి. ఆ పద్యములకు శ్రీసోమయాజులు గారి ఆంధ్రానువాదమును గూడ తిలకింపుడు.
తే. 'తొలుత నినుగని నతు డైన సంతుషిత్త, నవ్యరాకానిశి స్మితమొనర్పసాగె, పరగినట్లు దీర్ఘకాల పరిచయమ్ము నాకుపొడగట్టితివి యాక్షణాన నీవు.
'ప్రతిమామేఁ సజీవతాఁ సీ (అను) తే.
ప్రతిమయందున ఘన సజీవతనుబోలి, నేత్రపాళిని శుభకాంతి నెలవుకొనియె, కాని మన్మనోనిస్సీమ గగనమందు, బొలుపుమెరయ, గడునిమిడిపోయినావు.
ఇక మూడవ పద్యము : 'మానాకి రూపసీ మాహై' అను