తే. చమరముల మీఁద వేసిరి బరువు వారు అవ్వి కలసి, యాగక యపు జరుగుచుండె వానిపై నెక్కి కొందరు బాలు రంతం బ్రమద మొందుచునున్నారు పయనవేళ. తే. తే. ప్రక్కగా నేగుచును వారిఁ బట్టుకొనుచు నెద్దియో చెప్పుచును దల్లు లేగుచుండ్రి పోవుచున్నది యెచటికో పుత్రు లెరుఁగ వారు తెలియంగఁ జెప్పుచున్నారు తమిని.
బాలుఁ డొక్కఁ డీరీతిగాఁ బలుకుచుండె “వచ్చితిమి - అదె చూడుఁ మీ వచ్చినదియె యా వసుంధర యౌ నని యందు వీవు నెంతకాలమ్ము నుండియో యిటులనమ్మ!
అయిన నడచుచునుంటి నో యమ్మ! నీవు ఆగు టనుమాట తలఁచుట యైన లేదు అమ్మ! దేని జేరఁగ నిటు లరుగుచుంటి మట్టి తీర్ధభూమి యెచట నమరె చెపుమ!”
తే. "తండ్రి! అయ్యదె! ఆ దేవదారు వనికి నా యెదుటి సమతలమదె యట్టి నెలవు దాని దళములనుండి హిమానిఁ గొనుచు నింపుకొనుచుండెఁ బాత్రల నీరదములు.
ఈ గిరితటము దిగినంత నెలమి మెరసి మనకుఁ గనుపట్టు నెదుట నా మహిత మంజు భూమి యత్యుజ్జ్వలం బౌచుఁ బొలుపులొలయు తీర్థ రాజమ్ముగా భువిఁ దేజరిలుచు".
తే. అంత నా బాలుఁ డిడ కడ కరిగి యనియె "ఆగవే అమ్మ! ఇంచుక యాగు” మనియె “ఇంక మరికొంత కథ వినిపింపు" మనుచు హఠమొనర్చెను ముద్దుగా నాతఁ డపుడు.