Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/668

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

తే. వక్రరేఖాకృతి నది మగుచు నుండె విషయ వాయు హతిచే నొలసి యపుడు వరలి శూన్యాన చాంపేయ వర్ణకీల “లేదు లే” దని చెప్పెడి లీలఁ దోఁచె.

తే. ప్రళయ పావనశక్తి తరంగపాళి యా త్రికోణాన జ్వలియించు చపుడు మెరసె శృంగ డమరుక నాదమే చెలఁగు చప్పుడు నిఖిల జగములఁ దానయై నిండియుండె.

తే. చేతనమయాగ్ని వెల్గుచుఁ జెలఁగు సతము అట మహాకాళ విషమ నృత్యమ్ము! విశ్వ రంధ్ర మట జ్వాలతో నిండి రక్తి నాత్మ విషమనాట్యమ్ము తమిని గావించుచుండె.

తే. స్వప్నమును స్వాపమును మరి జాగరణము పొలిసి యిచ్ఛా క్రియా జ్ఞానముల్ లయించె అమృతమగు ననాహత శబ్దమందు మనువు తన్మయత నిల్చె శ్రద్ధాద్వితీయత నొప్పి.