Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/664

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

తే. విధియె కర్మచక్రము నడిపించుచుండు సంభవించు మమత్వ వాసనలు తృష్ణం బాణి పాద మయమ్మైన పంచభూత పూజనము సాగు నిచట విస్ఫూర్తి నెపుడు.

తే. కల్గు సతత మియ్యెడను సంఘర్షణమ్ము రమ్య వైఫల్య కల్లోల రాజ్యమిద్ది మత్తతను గైకొనిన యీ సమాజమెల్లఁ బరుగులిడుచున్న దొక ఘనధ్వాంత మందు.

తే. స్థూలు లౌదురు రూపాల సొగయఁ జేసి భయద పరిణతి కర్మనిర్వహణ వలన! బహుళ కాంక్షలఁ దీవ్ర పిపాస కలిగె గాఢ మమతచేఁ గాఠిన్య గరిమ యొదవె!

తే. శాస నాదేశ ఘోషణ చటుల విజయ భయద హుంకార మెయ్యెడ వరలఁజేయు ఆఁకలిని వికలతఁ జెందినట్టి దళితుఁ బదతలమ్మునఁ బలుమారు పడగవైచు.

తే. 'ఉన్నతినిగూర్తు' మని మత్తు గొన్నవార లిచటఁ గర్మబాధ్యతను వహించుచుంద్రు తప్తులగుట బొబ్బలు కల్గి, దేహమందుఁ నెపుడు పగులుచు రసిగారు నెక్కువగను.

తే. ఇచట రాశీకృత మ్మైన యెల్ల విభవ మమరుచు మరీచికా జాల మటులఁ దోఁచు క్షణిక భాగ్యధను లయి నాశనము గొనిరి అయిన యత్నము చేసెద రందె వీరు.

తే. చేయ నపరాధముల నెల్ల సిద్ధపడుట యశమునకు లాలసత యిటు నబ్బుచుండు అంధమగు ప్రేరణముచేత నరగుచుంద్రు గణనగావించెదరు తమ్మె కర్తలనుచు.