Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/658

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

తే. శ్వేత గజరాజ ఘన గండసీమ చెలఁగి స్నిగ్ధ మధుధారలను విరజిమ్మినటుల నిమ్న దేశాన శతశత నిర్ణయిరమ్ము లింపు లెనయించుకొని ప్రవహించుచుండె.

తే. శాద్వలత యుబ్బి కన్నట్టు సమతలములు పటము లటుతోప నొప్పుగా వానియందుఁ జిత్రచిత్ర రేఖావళీ స్పీతరుచుల నెనసి తోఁచి సతము ప్రవహించు నదులు.

తే. రత్నగర్భ పైఁ గల వెల్ల లఘు తమములు ఓలసె శూన్యావరణ మట నూర్ధ్వమందు అమరి కలదున్న తారోహణ మను నిశికి నంత మనెడి ప్రాతఃకాల మయ్యెనపుడు.

తే. "పొలఁతి! ఎచటి కీ ననుఁ గొనిపోవుచుంటి వే నధికముగ నలసితినే నెలంత! సాహసము నశించినది, నిస్సంబలుండ! బహుళ భగ్నాశగల పాంథ జనుఁడ, శ్రద్ధ!

తే. పద, వెనుదిరిగి- ఏను దుర్బలుఁడ ఇట్టి వాతచక్రమ్ముతోఁ బోరఁ జేతఁగాదు శ్వాస నరికట్టు నీ శీతపవనమునకు నిలువఁబడఁజాల నియ్యది నిశ్చయమ్ము.

తే. ఔను నా వారు- ఎవరిపై నలిగి వచ్చి నానొ వారెల్ల నావారు నాతి! వారు దూరమునఁ గ్రింద విడిపోయినారు కాని యేనె వారిని మరువఁగా లేను, పడఁతి!”

తే. అపుడు మెరసె శ్రద్ధా! మనో జ్ఞాననమున లలిత విశ్వాసయుత నిశ్చల స్మితమ్ము ఆమె కోమలహస్తాన నతని కెదియొ సేవయొనరింప వ్యగ్రత జెందెనపుడు.