రహస్యము (ఆంతర్యము)
ఆ వినీలాంధ్యమున నూర్వ మందుఁ గలదు చలన రహితమగు హిమము కడు స్తబ్ధగతిని అలసి యధ్వ మటు విలీనమయ్యె - అచటి నగము మానియై కనుచుండె నాల్గు దెసలు
తే. పాంధు లిర్వురు ఎప్పుడో బయలుదేరి నారు - పైపైకి నెక్కుచున్నారు వారు శ్రద్ధ ముందు మనువు వెన్క సాగుచుండి- రమిత సాహ సోత్సాహమ్ము లటుల నపుడు.
తే. పవన వేగము ప్రతికూల ఫణితిఁ దాల్చి యనియె “యాత్రికా! వెనుకకు నరుగుమోయి! ఇటుల భేదింతు నను నెట కేగుకొఱకు? ఎల్ల ప్రాణాలపై మోహమేల విడువ?
తే.. ఆ నగశిరము తాకఁగా నంబరమును బ్రీతి యత్నించుచున్నట్లు పెరిగిపోవు క్షతము లద్దాని సర్వాంగకములఁ గలిగె భయద సానువుల్ దరులు కన్పట్టుచుండె
తే. సోకి హిమఖండములపయి సూర్యకరము లెందరో చంద్రముల సృజియించుచుండె వలయగతులఁ జరించుచుఁ బవనమపుడు మరల నచటికి వేగానఁ దిరిగివచ్చు.
తే. జలధరము లటఁ గ్రిందను శక్రచాప విసర హారాళి యలను బర్వెత్తుచుండె కలభముల రీతి గర్వానఁ గడఁగెఁ దిరుగ శంప లనెడి భూషల మెరయింప సాగె.