Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/652

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

తే. అపు డపుడు తోఁచు ఛపఛప యనెడి ధ్వనులు వలను గల దీప్తి గడగడ వడఁకుచుండె సృష్టి తను తానే మరచి వసించు నచట సురభి విరహి తామ్లాన మౌ సుమముపగిది.

తే. ఆ సరస్వతీ నదివలె నమల విశ్వ సనమునను జూచె నటు నిటు శ్రద్ధ- ఆశ్మ లగ్నముల విద్దములయిన రత్నములుగఁ దెరచినట్టి కనుల్ రెండు మెరయుచుండె.

తే. చీఁకటిని జిలిబిలిసద్దు సేయు నెది! ఇది తరంగిణీమణి శబ్ద మేన? కాదు అంతికమున నొక గుహ, లతావృతమ్ము అం దొకఁడు జీవి నిశ్వాస మాచరించు.

తే. రమ్యమును, చిత్రితమ్ము నిర్జనతటమ్ము ఎంతయో పునీత మది వర్తించు శైల శిఖరము, లొకింత యున్న తస్థితి - మించి యెప్పె శ్రద్ధాశిరము వాని యున్నతులను.

తే.ఆమె లోకాగ్నిఁ దప్తయై యంతఁ గరఁగి స్వర్ణమూర్తిగ రూపొందె - స్థగిత దృష్టి మనువు వీక్షించె చిత్ర మా మాతృమూర్తి విశ్వమిత్రగఁ గనుపట్టె విమలరుచుల.

తే. ఇటుల పలికెన "అయ్యయో! ఎడఁదలోనఁ గాంక్ష నిండినదానవు గావు నీవు ఈవు కోల్పోయి సర్వస్వ, మింతి! అయితి వంచితవు- కోరి యెవ్వనిఁ బడసినావొ...

తే. వాని నిచ్చితి, దాక్షిణ్య హీన నగుచు పారి, యేమును విడచినవారి కీవు