తే. కాఁ డతఁడు మోసకారి నిష్కపటి- దొరుకు పెరిగితిని నేను మంజుల ప్రేమలోన - కనెద నవ్వేళ లీల నీ క్రమమునెల్ల మానవా! నీ యశోగతి మలయుఁగాత!"
తే. బాలుఁ డనియెను ! "తెంచఁగావలదు మమత అమ్మ! నా యెడ విముఖత నందవలదు పాలనము సేసి నీ యాజ్ఞ' వడసి నీదు ప్రణయలాలన నెవ్వేళ బహుళ కాంక్ష...
తే. విడువ కుందును గాక జీవించియైన, మరణమొందినను ప్రతిజ్ఞ - మంగళకర మౌనుగాక నా బ్రతుకు! లభ్యమగుగాక, మాత! నీ యొడి, విడిచిన, మరలనాకు”.
తే. "స్వచ్ఛ మీ యిడ - ప్రేమ సౌమ్య! నీదు వ్యథ హరించు తర్కమయి యీ యతివ నీవు శ్రద్ధగలవాఁడవు మననలక్షణుఁడవు ఆచరింపుము కర్మ భయార్తి విడచి.
తే. ఈమె తాపసంహతి తొలగింపు మయ్య! ఎలమి మానవశ్రీ యుదయించుఁగాక! సామరస్యమ్మున కిలఁ బ్రచార మిమ్ము పుత్ర! నీమాత చేసెడి బోధ వినుము !"
తే. "మధుర వాక్కులు విశ్వాస మంజులమ్ము లివ్వి- మరపు రాకుండుగా కెన్నఁడైన దేవి! చెలఁగుచు భవదీయ దివ్యగాఢ మైత్రి యవిరళ శ్రేయోర్గమముగ మెలఁగి...
తే. లీల జలదమ్ము లటుల వర్షించుఁగాక! తలఁగుగావుత సర్వసంతాపములును”- అనుచు నిడ ప్రణమిల్లి, పాదాబ్జధూళిఁ గైఁకొని, కుమారు సుమమృదు కరమువట్టె.