తే. శుభ్రరమ్యము, జీవితప్రోత- మద్ది సత్తు, నిత్యము చిరకాంతి సౌఖ్యదమ్ము తర్కమయి! ఊర్ముల గణించి తరగలందుఁ బ్రతిఫలించెడి తారలఁ బట్టి నిలతు.
తే. అష్ట యామములను జూచి తాగి యాగి, అది జడత్వపు స్థితి - భ్రమ నందవలదు కాంత! స్వాదువుల్ సౌఖ్యదుఃఖములు - వెల్గు నీడ - లా సరళపథము వీడినావు.
తే. భౌతికము చేతనము! అట్టి భావమెల్ల నీ విదె విరాగమున విభజించినావు చిరము, నిత్యమైన జగము చేతనతయె శతశతములుగ రూపాల నవతరించు.
తే. విరహ మేలన నటనార్తి నిరత మణు - వ మంద పరిపూర్ణ మంజు లానంద జగము! రాగ మొక డందు లీనపూర్ణతను మొరయు “ఇంక మేల్కొను” మనెడి ఝంకృతులతోడ.
తే. ఆహుతియగుచు నుండి లోకాగ్ని లోనఁ దష్తనై ప్రసన్న ప్రశాంతతను నేను ఒలసి క్షమియింప కెదొ కోరుచుంటి వీవు హృదయ కుహరాన నగ్ని జ్వలించునేని-
తే. పడఁతి! నాకడఁ గల నిధి బడయు మీవు నాదు మార్గమ్మె యున్నది నాకు సౌమ్య! ఉండు మిట! శ్రీద మగుత యీ యుర్వి! నీవు శక్తి, కర్మ వినిమయము సలుపుమయ్య!
తే. రక్తి సాగింపు డిరువురు రాష్ట్ర నీతి ఏలుబడిలోన ధీతిఁ గల్పింప వలదు వెదుకఁగా నాదు మనువును వెడలుచుంటి వాహినీ నగ మరు కుంజ వాటికలకు.