తే. యౌవనము జీవితమ్ముతో ననియె నిటుల: "ఓ మదించినదాన! నీ వోసి మత్తు రాల! చూచితే యేమైన" - యౌవనమ్ము పలికె నిట్టూర్చి: “నడువు సంబలము గొనుము.” తే. రక్తిమై చిత్ర మైనది శుక్తి పగిది స్వాతిబిందువు వైతివి చాన! నీవు నాదు నెదతమ్మి తూగె నానందమునను తెరవ! తమి నైతి వీవు పూఁదేనె వందు. తే. ఆకు రాలినకాలాన నతివ! యెంత చతురతను నింపితీవు పచ్చంద నమ్ము మాదకత్వ మటంచు నే మదిఁ దలంచి తిని- అదియె రూపుఁగొనె నింత తృప్తియగుచు. తే. ఎందు శోక వాత్యావర్ష మెసఁగు నెందుఁ బరమ పీడాతరంగముల్ ప్రభవమొందు, జీవిత మ్మెందు మృత్యువై చెలఁగు, నెందు బుద్బుదఁపు మాయ నాట్యముల్ పొనరఁజేయు- తే. అట్టి విశ్వము నిశ్వాస హసనములను లలిత శాంత్యుజ్జ్వలతలఁ గళ్యాణగరిమ కానుపించె - వర్షా నీప కానన మయి ఎ సృష్టి విభవము సెలఁగె నుజ్జీవనమున. తే. అట్టి పావన మధుధార నర్థిఁ జూచి భగవతీ! యమృతమె లోభపడును గాదె! పుణ్య సౌందర్య శైలమ్ముఁ బోలె నద్ది దానియందు జీవితము స్నాత మగుచుండె. తే. సంధ్య నాకడఁ దారకా సముదయముల యకథిత కథ గ్రహించి తా నరుగుచుండె అపుడు సకల శ్రమావిల వ్యథను నిద్ర సహజముగనె గ్రహింపఁగాఁ జాలి యుండె. 640 75 వావిలాల సోమయాజులు సాహిత్యం-1
పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/640
స్వరూపం