తే. తే.. జలము గ్రోలి పిదపఁ గొంత స్వస్తుఁ డైన మనువు కడు నెమ్మదిగ నిట్టు లనఁగసాగె "చెలియ! ఈ నీడ నిలువని సీమకిపుడె నీవు కొనిపొమ్మునను- ఉండనీయ కిటను. నాతి! మన మింక నిర్మేఘ నభము క్రింద నో మరెచటనో నొక గుహనో చరింత మనుభవించుచునే యుంటి మనుభవింత మెద్ది యేతెంచినను దాని నెల్ల వలచి”. తే. "కొంత యోపిక పట్టుము కొంచె మైన బలము రానిమ్ము అయ్యది వచ్చినంత నిన్నుఁ గొనిపోదు మరి మన నిన్ని క్షణము లైన నుండనీయదె యిట" - అనియె శ్రద్ధ.
తే. కుంచితాంగియై ఇడ నిల్చె- కోరి యిట్టి అధికృతిని లాగికొనఁ జాలదయ్యె నపుడు స్థిరత దోప శ్రద్ధ మనువు చెంత నుండె - 'అపుడు పల్కె నాతని వాణి యాగ కిటుల. తే. "నిండి జీవిత మందున నుండె నిచ్చ కొసరి స్వేచ్ఛానురోధమ్ము కూడియుండె అంతరంగాన నభిలాష అతిశయించె అమల మాత్మీయతాజ్ఞాన మర్ధి నిండె తే. ఉంటి నేను- సుందర కుసుమోజ్జ్వలముల దట్టమగు సువర్ణచ్ఛాయ తనరియుండె మలయ పవన తరంగాళు లొలయుచుండె ఉల్లసనముల ఘనమాయ యొప్పుమెరసె. తే. అరుణ సురభిళ చ్చాయోజ్జ్వ లాంతరమున కపు డుషాదేవి పాత్రిక నర్థి నింపి 60 638 వావిలాల సోమయాజులు సాహిత్యం-1