Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/637

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

తే. ఆ స్వరలహరికా మంజు లాక్షరాళి మధుర సంజీవనఁపు రస మై నదించె. ఐనయది ప్రభాతము ప్రార్ధి శాంగణమున ముకుళిత మనులోచనములు వికసితములు. తే. లభ్యమయ్యె శ్రద్ద యను నాలంబనమ్ము మరల - నిండెఁ గృతజ్ఞ తా గరిమ నెడఁద మనువు కూర్చుండె గాద్గద్యము ననులేచి పలికెనొక్కింత యనురాగభరితుఁ డగుచు. తే.

"మంచి దో శ్రద్ధ! ఈవె యే తెంచినావు కాని-పడియున్న వాఁడను నేను, తన్వి?" - అదియె భవనము, స్తంభమ్ము లవియె! అచట ఘృణయె నాల్గుదెసలను వ్యాపించియుండె. తే. "క్షోభచే నయ్యెడను మూసికొనియె కనులు తీసికొనిపొ మ్మెదో దూరదేశమునకు ఈ భయంక రాంధ్యమ్మున నేను మరచి మరల పోఁగొట్టుకొనవచ్చు మగువ! నిన్ను. తే. పట్టుకొని చేయి నీ వెంట వత్తు నేను ఇంతి? ఆలంబన మ్మౌ, లభించె, నిదియు తోచునా నీ వెవర వోసి! తొలఁగిపొమ్ము! రమ్ము! వికసించును మనస్సుమమ్ము, శ్రద్ధ!”

తే. శ్రద్ధ నిశ్శబ్దముగ విలోచనములందు నింపి విశ్వాసము శిరము నిమురుచుండె “ఈవు నావాఁడ విపు డెవ్వరేని యేల యడలుగొనవలె”నని చెప్పునటులఁ దోఁచె.

ఆంధ్ర కామాయని 55 637