తే. ఆ గృహమ్మున నాత్మీయ తప్పుడు తోఁచె చిన్ని పరివార మేర్పడి చెలఁగుచుండె ఆ మహిత మందిరమ్మెల్ల నలముకొనియెఁ జేరి శ్రద్ధా మధురగీతికా రవమ్ము తే. "మనసా! ఓహో! ఓ మనసా!! అతిశయ తుముల రణోజ్జ్వల ఘనకో నే లాహల కలహ మ్మందున నే నౌ దును హృదిలోఁ గల వలపుల పలుకును ఓహో, ఓ మనసా! తే. వికలమ్మై చిరచంచల మై నిద్రాక్షణ తే. ముల నన్వేషణ చేసెడి చైతన్య మ్మల పొందిన రీతిగ దోచును - ఓ మన సా? నే మంజుల మలయానిలము నొహో! ఓహో ఓ మనసా! చిరదుః ఖావిల మానసబాధా తిమిర న దోషస్వినిఁ బోలెడు నొక జ్యోతిరేఖను నే నై యుందు నె వేళను గనఁగా-ఓ మన సా! సుమవికసిత ప్రాతఃకాలము నోహో! ఓహో ఓ మనసా! తే. మరుభూముల నగ్నిజ్వాలను గనలెడి చాతకి జలబిందువులకు వ్యాకులపడియెడి, జీవితత్రుటులను నే నౌ దోహో, ఓ మన సా! సుమనోహరఘన వర్షర్తువు నియ్యిల! ఓహో, ఓ మనసా! తే. పవన ప్రాచీరమ్మున నిలిచి జ్వలించెడి జీవన మిదె నమితమ్మై బ్రతుకుచు నున్నది కుమిలిన యీ విశ్వమ్మను పగటికి ఓ మన సా? నే నామని సొగసులు శార్వరి నోహో! ఓహో ఓ మనసా! తే. నిత్యనిరాశా నీరద గుచ్ఛాచ్ఛాదిత లోచన 636 బిందు సరోవర మందున షట్పద ముఖరిత మంజుల మాధ్వీ ముకుళిత మోహన హిమకరణ జలజాతమ్మును నే నోహో ఓ మనసా! ఓహో ఓ మనసా!" 50 వావిలాల సోమయాజులు సాహిత్యం-1
పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/636
స్వరూపం