నది యదాటుగ - శ్రద్ధ యెయ్యదియొ చూచె అడుగులను వేయుచును దాని కడకుఁ జేరె.
ఆ మనువె నిక్కముగను గాయపడినాఁడు! అయిన స్వప్న మిటుల సత్యమైన యదియె? "అయ్యయో! ఓయి ప్రాణప్రియా! ఇదేమి? ఈవె- ఇటులనా...” ప్రవహించె నెద ద్రవించి, తే. చకితురా లయ్యె నిడ, వచ్చి శ్రద్ధ, చేరి నిజకరమ్మున మనువును నిమిరె నపుడు ప్రాపిత స్పర్శ మధులేప నోపమమ్ము! ఏల నిలచును వ్యథ యది యెట్టి దైన? తే. బహుళ మూర్ఛిత మా నీరవత్వ మందు వరలి మెలఁగెఁ గొలఁది లఘు స్పందనములు మించె కందోయి పొంది యున్మీలనమ్ము తోఁచి కోణాల నిండె బిందువులు నాల్గు. తే. మందిరమ్మును, మంటప మహిత వేది కలను పుత్రుఁ డయ్యెడ నటఁ గనుచునుండె “ఏమి యిదియెల్ల నా మది కిడుచుఁ బ్రీతి నిటుల మోహనాకృతిఁ గనుపించుచుండె!” తే. తల్లి అనియె “అరే! రమ్ము తడయ కీవు నాన్న! ఈ యెడనె పడియున్నాఁడు!!, చూఁడు!!" “నాన్నయా? ఇదె వచ్చుచున్నాను నేను” అటుల ననువేళ నొదవె రోమాంచితమ్ము. తే. "ఇమ్ము జలములఁ, కొనియుందురమ్మ డప్పి ఏ మొనర్తువె కూర్చుండి యిచట నీవు?" మొనసి శూన్యమంటప మయ్యె ముఖరితమ్ము ఈ సజీవత్వ మది కన నెచట నుండె? 40 45 ఆంధ్ర కామాయని 635