తే. వాస్తవము కంటె కమనీయ వైఖరులను దీనినే సత్యము వరించుఁ దీపి నెరిఁగి." తే. అపుడు విని యెదొ దూరాగ తారవమ్ము విడ యోజనలలోన నులికిపడియె రమణి యెవతెయో, యా స్తబ్ధ రాత్రివేళ నిటకు వచ్చుచుండె నడచి, యిట్టు లనుచు "తెలియఁజేయుఁ డోహో దయోదీర్ణులార! నా ప్రవాసి యే కడన నున్నాఁడొ యేమొ! అట్టి యున్మత్తుని యనుషంగారమె యిటు నేను జగము నెల్లఁ బ్రదక్షిణించు చుంటి. తే. అతఁ డాత్మీయత యెడనె యలిగినాఁడు తెలియనైతిఁ జేయఁగను నాత్మీయు నతని నతఁడు నావాఁడె యై యున్న కతన నపుడు తెలిసి యే నెవ్వని యలుకఁ దీర్పవలయు? తే. అదియె పొరపాటు- ఇప్పుడ య్యదియె యొక్క కంటకము నా మనమ్మును గలఁతవెట్టు పురుషు నాతని నేనెట్లు పొందగలను? వచ్చి యెవరైన యీ యెడఁ బలుకుఁడయ్య. ” తే. లేచె ఇడ చూచె అస్పష్టరీతి నొక్క
ఛాయ రాజవీథి నడచుచాయఁగనియె వాక్కునం దున్నది కరుణావ్యథయె నిండి ఆ పిలుపు జ్వలియించు చున్నట్లు తోఁచె. శిథిల వపువు వసనము విశృంఖలమ్ము చెదరి విడివడ్డ చంచల చికులపాళి ఛిన్నపత్రమ్ము, విశ్లేథ స్నిగ్ధ మధువు మానరుచి యైన ప్రసవమ్ముమాడ్కి నుండె ఆంధ్ర కామాయని 30 633