Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/624

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

తే. గాఢ మానస గళిత దుఃఖమ్ముతోడ వారు క్రుద్ధులై యీ రీతి పలికినారు "కనుమ నీ, వియ్యెడను భవ న్ముఖము నుండి యే పలికె పాప మిట్లు మహీమహేంద్ర! తే. తలప మాకు యోగక్షేమములకు మించి సంచయము ప్రీతిమైఁ బూని సలుపు లోభ మొనరఁగా నేర్పి పడవైచి, తో యిలేశం? చారు ఘోర దారుణమైన సంకటమున. తే. అమిత సంవేదనా శీల మబ్బె మాకు అరయ నిర్దియే దొరికినదైన సుఖము ఏము కల్పిత దుఃఖాల నేర్పరించి కష్టముల్ గల్గె ననుకొనఁ గడఁగినాము. తే. యంత్రముల మూలమున, రాజ!, యఖిలజనుల ప్రాకృతిక శక్తి కర్షించి భయదరీతి జీవితము నెల్ల మివుల శుష్కింపఁజేసి శిథిలమును, నశక్తమ్మును జేసినావు. తే. ఏల యిట్టి యత్యాచార మీ వొనర్చి నాఁడ విటపయి ఓ జననాథ! - యిచట నందఱి బలాభిరక్షతో నిందుకొఱకె నీవు బ్రతికినాఁడవె మనూ, నిఖిలభర్త! తే. కడఁగి మా మహారాజ్ఞి యౌ నిడను దలఁప కిప్పు డిటుల బందీని గావించినావు ఇంకమఱి నీకు రక్షణ యేది యిచట? ఓయి యాయావరా! ఎటు లుండుఁ జెపుమ!" తే. "అయిన ప్రకృతి, పుత్తలికల యమిత భయద సముదయంబుల మధ్య నిశ్చలత జీవి 624 95 వావిలాల సోమయాజులు సాహిత్యం-1