Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/619

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

తే. తే. తే. మఱల నల్లటతల్లట మలఁగుఁగాక! నౌక ఊర్మికల్ ప్రవహించుఁగాక పయిన!! సావధానమ్ముఁ గొనుఁగాక చదల సూర్య చంద్ర నక్షత్రతతులు సంచకిత గతుల!! కాని - చెలియ! నిలువుము నా కడనె నీవు నీవు నాదాన వెప్పుడో నెలఁత! నిజము ఆడుకొనుటకు నీకు నే నబల! యొక్క క్రీడరీతిగ నుండెడివాఁడఁ గాను. ”

“నా వచనముల నర్థ మ్మొనర్చుకొనఁగఁ దలఁపవైనను యత్నమ్ము సలుపవలయు! ఏల యుత్తేజితుండ వై యిటుల నీదు ప్రాప్యమును బొందనెంచవు ప్రభువరేణ్య! తే. ప్రజలు క్షుబ్ధులై శరణమ్ము వడయ నచట నిల్చియున్నారు- ప్రకృతి యున్నిద్ర నిత్య ఘనత రాతంక పరిపూర్ణ కంపమాన యగుచును క్షణక్షణము ప్రత్యక్షమౌను! తే. ఏ శుభాకాంక్షిణిని నౌట నింక నేమి చెప్పఁగలదాన - జాగ్రత్త! చెప్పినాను చెప్పఁదగినదియును నేను జెప్పవలసి నదియు - ఇంక నిట నుంట యర్ఘమ్మె నాకు.”

తే. "ఆడి యొక కొన్నిమాటల, నతివ! చిన్ని బాల లాటల 'జిల్లాయి' పలికినటుల నిదియె, మాయావినీ! యెట కేగుచుంటి విటుల సెలవు గైకొనుచు నన్నిచట నిలిపి. ఆంధ్ర కామాయని 60 65 619