Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/618

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

గావలయు నీపయిన నధికారమతివ! అద్ది లేక ప్రజాపతి యగుట వృథయె. తే. తరుఁణి! నినుఁ గనినంత బంధనము లెల్ల నిపుడు తెగిపోవుచున్న వహీనముగను శాసనమ్ముల నధికార సముదయముల నేను కాంక్షసేయుట యేల నించుకైన? తే. పరమ దుర్ధర్షమైన యీ ప్రకృతి కంప నమును గను మొకమారు నీ నయనములను నాతిరో! క్షుద్ర మా స్పందనమ్ము నరయ నతి విపులమైన నా హృదయమ్ము నెదుట. తే. అతికఠోరత నవ్వుచు నాడె నిదియె ప్రౌఢరీతుల సకల మా ప్రళయఖేల కాని యిపు డొంటరి యగుచుఁ గడఁగి యీతం డెంత సుకుమారుఁడై నిల్చు నిటుల నిచట! తే. విశ్వ మొక లయ యని యాత్మ వివర మందు నమ్మి పల్కుచునున్నావు, నాతి!, నీవు లీన మౌదునా యే దానిలోన- ఉవిద! కాని, సుఖ మేమి యున్న దద్దాని యందు తే. ఏను సృజియించుకొందుఁ బ్రత్యేకఫణితిఁ గ్రంద నాయత ఘనత రాకాశ మొండు అందుఁ దోఁచు రోదనలోనఁ బొంది నిన్ను నట్టహాస మొనర్తు నత్యంతముగను. తే. అంబునిధి మరల నిజ మర్యాద వీడి యిచ్చమెయి గంతులిడి నదియించుఁగాక! వచ్చిపోయెడఁగాక తా వజ్రగతుల నతులభయ దోరు తీవ్ర ఝంఝానిలమ్ము. 618 55 వావిలాల సోమయాజులు సాహిత్యం-1