Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/609

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

తే. వణకసాగె శ్రద్ధాదేవి స్వప్నమందు కనులు విడివడె నప్పు డాకస్మికముగ "ఏమి చూచితి నే నిపు డిద్ది యేమి? ఇంత మోసకారిగ నతం డెట్టులయ్యె!” తే. స్వజనమైత్రియం దెన్నియో భయముగొల్పు గట్టి సందేహముల్ మదిఁ బుట్టుచుండు ఇప్పు డేమగు నన్న యహీనయోజ నలను రాత్రెల్ల గడిచె వ్యాకులతతోడ. 105 ఆంధ్ర కామాయని 609