గగనమందలి తారల! కడలి బుద్బు దముల యధికములు? గణింపఁ దలఁపుమమ్మ! తే. ఒందఁ బ్రతిబింబములను నీ యందుఁ దార లుదధిఁ గలియుటకై యేగుచుంటి వీవు? రెండు నివి ప్రతిమూర్తులై యుండెనేమొ! ఈ రహస్యమ్ము నీ వెఱింగింపుమమ్మ!! తే. బహువిధమ్ముల నాకాశపటము మీద నెన్ని చిత్రాలు పుట్టి నశించుచుండె పరఁగు నన్నిఁట నింద్రచాపమ్ములోని రంగులను బోలి మెరయు వర్ణమ్ము లొదిగి. తే. కాని, క్షణమున సకలాణు గణము లెల్లఁ గరఁగి, నీలశూన్యత వలె, గాఢ వేద నా భరిత ధూమలపు వసనమ్ము నొండు వాంఛతో నేయుచుండెఁ బ్రపంచమునకు. తే. తే. ఉదిత దుఃఖాన నాదు నిట్టూర్పుగాడ్పు వెడలకుండుత ఈ కుహూవేళ యందు స్నేహమును ప్రజ్వరిల్లగాఁ జేసి వెల్గు నిట్టి లఘు దీప మీయెడ నెచట నుండె? ఆరిపోకుండుఁ గాక సంధ్యాంశు వటులం బరఁగు చీ కుటి నున్న దీపశిఖ యెపుడు శలభ మెయ్యది లేకున్న సవిధమందు మంచి దిది యొంటి వెల్గుచు మించుఁ గాక! తే. ఏమి చెప్పినఁ గోకిల మ్మేను విందు మౌనముగ-ఐన నియ్యెడఁ గానఁబడదు మున్ను సమ్మోహనాకృతి నున్నయట్టి ప్రసవధూళీ మహోత్సవ ప్రాభవమ్ము. 15 596 వావిలాల సోమయాజులు సాహిత్యం-1
పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/596
స్వరూపం