తే. నరుఁడు వహియింపఁగా పాలనాభరమ్ము తెలిసె నుషనవ్వినది తూర్పుదిక్కునందు అట్టి కౌతుకమును గన నరుగు దేరెం బరమ చంచల మలయజ ప్రౌఢవనిత. తే. ప్రకృతి సుందరీ మృదుకపోలములఁ దోఁచు లాలిమను గని యనురాగ లాలసతను మత్తుఁగొన్నట్టి తారకా మహితదళము క్రిందఁ బడుచుండెఁ జిక్కని యందములను. తే. ఫుల్ల జలజాత కాననభూము లందు సాగె నళికుల నర్మభాషణము లపుడు వసుధ సకలము, సంతోషవర్తనమున మరచి శోకము, కన్పట్టె మంజులముగ తే. "జీవిత నిశీథ తిమిరము చెలియ! అదియె నిన్నుఁగని పర్వువెట్టుచు నున్న దార్తి నాననముఁ గప్పికొని క్షితిజాంచలమున నీవు నిల్చినయెడఁ దాను నిల్వలేక తే. ఉవిద! ఇడ! ఉదార వయి నీ వుషసివోలె వచ్చితివి నేఁ డిచటికి నా భాగ్యవశత సుప్త మన్మనోభావ నిస్తుల ఖగాళి కలరవమ్ముల తోడ మేల్కొనియె నిపుడు. తే. కిరణ వీచికానిచయ సంక్రీడఁ దనరి నవ్వుచుండెఁ బ్రసన్నత నవకములను: అన్య- యవలంబనల్ విడి యర్థి బుద్ధి వాదన స్థాన బుద్ది యేఁ బొందినాఁడ. తే. అఖిలములు వికల్పము లింక యరుగు గాత! యమల సంకల్పములు అర్థి నగునుగాత! జీవితము కర్మమయ!! మీలఁ జెలఁగు చెపుడు విమలసుఖసాధన ద్వారవివృతి యగుత!!" ఆంధ్ర కామాయని 125 130 593
పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/593
స్వరూపం