Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/592

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

తే. కరములను జూచి యాచింపఁ గడఁగరాదు- నడుపవలయును నిజపాద నళినయుగళి ఏ నడువవలె ననుధ్యాస యెవని కున్న వాని నెవ రెపుడాపఁగాఁ బూనఁ గలరు? తే. అవును నిజమిది - నీ 'సహాయకుఁడు' నీవె తే. బుద్ధి యెదిచెప్పు దాని నొప్పుకొన కెద్ది శరణు - ఎన్ని యూహలును సంస్కారములును గలవొ వాని కన్యోపాయములును లేవు. పరమ రమణీయ మైశ్వర్య భరితమైన ప్రకృతి మర్మజ్ఞరహిత మై పరగుచుండు అర్థి నద్దాని ప్రతిసీర నవసరింపఁ గడఁగి నీ వింకఁ గర్మలీనుఁడవు గమ్ము. తే. నియమనము, పాలనమ్మును నీ వొనర్చి నీ క్షమత నిఁక వృద్ధినొందించుకొనుము ఎపుడు విషమత్వము సమత యెచటనుండ వలెనో నిర్ణయమొనరించువాఁడ వీవె. తే. బహుళ విజ్ఞాన సాధనోపాయమునను జడత నెల్ల చేతనతగ సలుపుమయ్య! అపుడు వ్యాపించు భవదీయ యశ మనంత విశ్వ కుహరాంతరాన సంప్రీతిదముగ.” తే. హసన మొనరించినది శూన్యమైన లోక మా గగనము అద్దాని గర్భాంతరమున జీవన మరణ శోకముల్ చేరి యెన్ని యో వసించి నశించెను యుగయుగాల. తే. మించి హృదయముల మధు సమ్మేళనములు విరహ కోకములై వలపించె నచట 592 ఈ విషయ ఘనభారమ్ము నెల్లనేఁడు తన శిరమ్మునందు మనువు తాల్చినాఁడు. 120 వావిలాల సోమయాజులు సాహిత్యం-1