విమల విద్యుత్తతులను, వ్యాపింపఁజేసి నట్టి యా మహాకాళుఁ డత్యంత జలధి... తే. వీచి కాఖీల నటన గావించుచుండె ఈ వసుంధ రాల్పప్రాణు లెల్ల భీతిఁ బరగఁ గోరెనే యెడద నిష్ఠుర కఠోర సృష్టి నాశనవిజయ మై యెసఁగు టేన? తే. నాశయుత మైన దాని నీ నాటివఱకు నేల తలఁచిరి మూర్ఖులు సృష్టి యనుచు దాని యధిపతి యెవ్వఁడో తనరుచుండు నిం కొకండు నెచటనో వసించుచుండు. తే. అరుగ లేదు దుఃఖఁపు కేక యతనివఱకు సుఖ మనెడి నీడము మివులఁ జుట్టియున్న యది విషాదావరణ మిట్లనవరతమ్ము కోరి యెవరుంచి రీ యవకుంఠనమును. తే. నెగడుఁ గడుదూరమున శనినీల జగము దాని చాయవలెను గ్రిందఁ బైన నిటుల దుఃఖగగనము వ్యాపించి తోచుచుండు- దాని పరమున నెద్దియో తనరుచుండు - తే. ఘన మహా కాంతిపుంజ మొకం డటంచు చెప్పఁబడుచున్నయది - ఇచ్చి స్నిగ్ధకిరణ మొం డది నియతిజాలమ్ము నుండి ముక్తి వడసి స్వేచ్ఛనొందుటకుఁ దోడ్పడఁగఁ గలదె?"
తే. "ఎద్దియైనఁ గాని మ్మది యేల పలుకు? వెఱ్ఱనరుఁ డుండఁగా నమ్మ వీలుపడదు. అతఁ డెఱిఁగి నిజబల దుర్బలతల నుంచ వలయుఁ జరణము గంతవ్యపథము నందు. 110 115 ఆంధ్ర కామాయని 591