Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/590

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

తే. తంద్ర స్వప్నములు తిరోహితమ్ము లయ్యె, విపుల కాంతివన్మాయ వ్యాపించియుండె ప్రణయపులకల నెసఁగు నా స్పర్శనమ్ము గడచిన యుగమ్మును బిలువఁ గడఁగె నపుడు. తే. అలలు పలుమారు నృత్యమ్ము లాచరించు నువిద ప్రతిభా ప్రసన్నత లొదవఁ బలికె "ఇడను నేను, నీ వెవ్వర, విచట నుంటి తే. వార్య! డోలాయమానుఁడ వగుచు నిటుల?" పలుచని ముకుపుట మదరిపడుచు నుండె అపుడు నిండితోఁచిన దమూల్య స్మితము, “విశ్వపథికుఁడ వినుము నా పేరు మనువు ఇంతి! నే క్లేశములను భరించుచుంటి”. తే. "స్వాగతము! కను నీ ప్రదేశ మిదియెల్ల శిథిల సారస్వతావని చెదరిపోయె! నాదు దేశమిది, ఇటు వినాశమొందె భౌతికంపు టస్తవ్యస్తఫణితి వలన.” తే. "కనుచు నిద్దాని దీనతాకలిత నగుచు ననయ మిట్టులె యుండఁబో దనుచు నమ్మి యాశతో శుభదిన మెదొ యరుగుదెంచు నంచు నిటఁ బడియుంటి నే నార్యవర్య!

తే. "వచ్చితిని దేవి! తెలియఁగా బలుకు మిపుడె యమలజీవన నైజ మూల్య మెది యగునొ దివ్య మహనీయ గుణ! నీవుతెఱువు మింక భవ భవిష్య ద్వారమును నాపై రహించి. తే. ఈ జగత్కుహరాన సృజించి యింద్ర జాలమును, గ్రహతారకా సముదయమును, 590 105 వావిలాల సోమయాజులు సాహిత్యం-1