తే. లలిత కేశముల్ తర్కజాలమ్ము వోలెఁ జిందరగ వందరగఁ గడు చెదరియుండె విశ్వమకుటమ్ము పోలిక వెలసి మెఱయు నబ్జఖండమ్ము వలెనొప్పె నామెనొసలు. తే. పద్మపత్ర చషకములై వరలు కనులు లలిఁ గురిసె ననురాగ విరాగములను గుంజరిత మధుపయుత ముకుళము మాడ్కి నమరె గానభరితమ్మైన యాననమ్ము. తే. వక్షమునఁ బ్రపంచజ్ఞానభర మహమ్ము సర్వము సమీకరించి యుంచఁబడి యుండె తనరు నొక హస్తమున వసుధాతలంపు కమ్రజీవిత రససార కర్మపాత్ర. తే. అన్యమిచ్చును మధురాభయావలంబ Gh తే. నమ్ము యోజన ఘనత రానంతమునకు త్రివళి త్రిగుణ తరంగమై తివురు నామె రమ్యకాంతివసన మరాళముగఁ గట్టె. తాల సంయుత గతి పాదములను దనరి ప్రాణముల కేక యట నీరవముగఁ దోఁచె జడముగా నుండె జీవనసరసి భంగ హీనమై- మహాహిమము వ్యాపించియుండె. తే. చంచ లానిలమొలసి నిస్తబ్ధముగను దీర్ఘమౌ నలసతను నిద్రించుచుండె కడగి త్రావె మానస కంజ కళిక యాత్మ మధుర మధుబిందువులను దా మౌనముగనె. తే. అచట రుద్దములయ్యె దిగంతములను స్వనము లాకస్మికమ్ముగా ననియె మనువు “స్వాదు హసన సుచైతన్యసహిత యగుచు నరుగు దెంచెను, హేమాభ, యతివ ఎవతె?" ఆంధ్ర కామాయని 100 589
పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/589
స్వరూపం