Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/585

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

తే. సీమయౌ నిరాశా శోణ చిత్రవర్ణ క్షితిజ మతుల కాంక్షా ఘనసింధువునకు విభజనము సేసికొని నిన్ను వే విధాల నిచ్చ వలకు వందరను ద్వేషింతు వీవు తే. ఎనయు వైరము మస్తిష్క హృదయములకు ఎట్టి సద్భావ ముండఁబో దీద్వయాన బుద్ధి యెటకైన హృదయము న్బొమ్మటన్న నరుగు మరి యెటకొ వికలమగుచు నద్ది. తే. వర్తమాన క్షణమ్ములు పరమ దుఃఖ భారమున సాగు సుందరస్వప్న మగు నా యతీతము, నీవు జయాపజయము లనెడి యుయ్యల లూగెదవయ్య మనువ! అల నసీమ మమోఘమ్ము నైనశక్తి సంకుచితమగు బహుభేద సంభరితము భక్తి జీవితమును గడు భయద గాఢ కష్టపథమున నడిపించుఁ గడక నపుడు... తే. తే. లేక యసక లాహంకార లీల నొక్క కడ మహాసక్త యగును రాగమయి, అపుడు నియతిచేఁ బ్రేరితమ్మయి నిశ్చయముగ బంధితమ్మగు నిజసీమ వ్యాపకతయె. తే. పరమవిద్య యగుచును “సర్వజ్ఞ" మైన జ్ఞానలఘ్వంశ కొన్ని ఛందములు వలుకు లలిత సత్కళా కరణ కార్యము ల వెల్ల ఛాయవలె నౌచు జగతి నశ్వరము లగును. తే. నిత్యతకు దూరమగుచు నిర్నీతిఁ దరలుఁ గాల మిలలోన మనువరా! క్షణము క్షణము తెలియలేవు శుభేచ్ఛకుఁ గలదు చెడుగు కంటె ఘనశక్తి- తర్కానఁ గర్మచెడును. ఆంధ్ర కామాయని 70 75 585