తే. అమితవేదనా దీర్ఘభేదము లభించు వక్షజడతయె యెడఁద కావరణ మగును ఇల జనులు పరస్పరము గుర్తింపలేరు విశ్వము పడుచు లేచుచుఁ వెడలుచుండ... తే. పరిగి యెదుట నఖిలము సంపన్నమయ్యు తొలఁగి సంతుష్టి నిరతము దూరమగును ఇట్టి లఘుదృష్టి దుఃఖమ్ము నిచ్చుచుండు ఎన్నియో కోర్కెలెపుడు జనించుచుండు. తే. కాంక్ష లనియెడి శైలశృంగమ్ము లశ్రు జలధరమ్ములఁ జుంబింపఁ దలఁచు నిండు జీవననది హాహారవ జీవనములఁ గలఁగి పెల్లు పీడాతరంగములు రేగు. తే. లాలసాయుత యౌవన రమ్య సమయ మాకురాలెడి కాలమై యరుగుచుండు బహుళ నవ్యసందేహముల్ ప్రభవమొందు అందుచే భీతసంతప్త మగుచు నెపుడు... తే. స్వజన వైరము తిమిరమై వరలి నిండి పృథుల నీల 'కుహు' వలె వ్యాపించుచుండు బహుళ సస్య సుశ్యామల ప్రకృతి లక్ష్మి తల్లడిల్లును దారిద్య్ర దళిత యౌచు. తే. అమిత తృష్ణార్తి కాకృష్ణుఁ డగుచు నరుఁడు పతఁగ మై యంత గాఢ దుఃఖాబ్ది యందు శక్రచాప మై మార్చు నజస్ర చతుర బహుళ నూతన రమణీయ వర్ణములను. తే. పరఁగదు పరిపూత గతినిఁ బ్రణయమెచట స్వార్థముల నావృతమ్మయి సంకుచితము భీతమును నగు - సృష్టి జీవితము విరహ భరితమైసాగు కరుణ సంస్ఫురిత గీతి. 584 65 వావిలాల సోమయాజులు సాహిత్యం-1
పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/584
స్వరూపం