Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/581

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

తే. ప్రళయ భయభావమున దేహరక్ష కొఱకు భక్తిఁ బూజింపవలె నన్న వ్యాకులతయుఁ బరఁగు దీను గావించు నీ ద్వయము నన్ను నేను శ్రద్ధావిహీనుఁడ నిజముగానె.”

తే. మనువ! శ్రద్ధాసతిని నీవు మరచినావు: ఆత్మవిశ్వాసపరిపూర్ణ యామె ఎగురు గొట్టితివి దూదిపింజగా నట్టిసతిని తలఁచితివి విశ్వమది యసత్తనుచు నీవు. తే. తంతువున నూగు నిట జీవితమ్మటంచు సౌఖ్యసాధనలోఁ జెల్లు క్షణములవియె నెలయు సత్యమ్ములనుచు భావించినావు వ్యసనపరితృప్తియే నీకు స్వర్గమయ్యె. తే. ఇద్ది వ్యతిరేక బుద్ధి యార్జించుకొన్న వ్యర్థ మౌ జ్ఞానము పురుషత్వపు విమోహ మొదవ, స్త్రీకిఁ గొంతగ సత్త యున్న దనుచు మరచినావయ్య మదిలోన మనువరేణ్య! తే. ఇలను నీ యధికారాధికృతుల మధ్య వరులు బంధము సమరసత్వమ్ము గాదె” అనుచుఁ గంపింపఁగా ననంతాంబరమ్ము పరమ తీక్షణోజ్జ్వల వాణి పలుకునపుడు

తే. మదినొసంగి తాను వినెడి మనువు నెడఁద యందు శూలము గ్రుచ్చుకొన్నట్టు లయ్యె "అరె! ఎవరిది? మరల నా యనంగుఁ డేన? నన్ను భ్రమయందుఁ బడవైచి మున్నితండు... ఆంధ్ర కామాయని 45 581