Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/579

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

తే. కల్గు సంకోచము ప్రణయగరిమ యందు విజన దిశలందు వ్యథనిండి వెల్లివిరియు ఇట్టి జీర్ణపాదపమున నిదె చిగుర్చు చుండెఁ జిద్వృత్తి 'సురలత' యుదియకొనుచు. తే. జీవితసమాధి సంబంధి శిథిలములను నతి నిశాంతముగా వెల్గునట్టి దివ్వె లివిగా, వలచి తమకుఁ దామె యిటుల నిపుడు శమిత మగుచున్నవి అతి ప్రశాంతముగను. తే. శ్రాంతుఁడై మను వటఁ బథిశ్రమము వలన నిటుల నేమేమొ మివుల యోజించుచుండె సకలసుఖ సాధనమ్ము ప్రశాంత యుతము నైన శ్రద్ధనివాసమ్ము నాతఁ డెపుడు... తే. విడిచి వచ్చెనో యటనుండి విపుల మార్గ ములను దిరుగుచు, నాగుచు నలసినంత వచ్చి, తుద కీ శిథిల పురప్రాంత మునకు - ఇట సరస్వతి పేర్మి నందించుచుండె. తే. శ్యామనిశి యపుడుండె నిస్తబ్దముగను దళిత వసుమతీ వికల దుర్దశ నవేళ ధీరగతి వెల్గుచు ననంత తారకాళి కడఁగి నిర్నిమేషమ్ముగాఁ గనుచునుండె. తే. వృత్రహుని జనాకీర్ణ పురీలలామ మిద్ది యెంతయు శూన్యమై యిట్టు లయ్యె ఇంద్ర జయకథా స్మృతులు కల్పించుచుండె, నిబిడ దుఃఖములను ద్విగుణీకృతముగ తే. దివ్య మిట్టి సారస్వతదేశ మిపుడు పొందుచు నహీన దుస్వప్నములను క్లాంత గతి వహించియున్నది- నలుగడల నలమి వ్యాప్తిఁగొన్నది ఘోరత రాంధ్య మిదియె. ఆంధ్ర కామాయని 30 579