తే. తత మహా దుఃఖమయ జీవితప్రకాశ మాత్మ సౌఖ్యాన నిహతాశమై విశాల గగన నీలలతా శాఖికలను జేరి చిక్కుకొన్నది కదలికఁ జెందలేక. తే. వేని నే మొగ్గలనుచు భావించినానో వ్యాప్తిఁగనె ముళ్ళుగాఁ జుట్టుప్రక్కల నవి ఎంత విజనాన నేఁ బయనించినాఁడ! అలసి పడియుంటిఁ బూర్తిగా నయయొ, యెటనా! తే. నన్నుఁ గని ముక్తశిఖరాలి నవ్వుచుండె ఏను నిర్వాసితుఁడను రోదించుచుంటి శాంతి వీడి ఈ విధి నటీ చటుల నృత్య భీషణచ్ఛాయ యిదె తాండవించుచుండె. తే. కోటరము వోలు శూన్యతావాటి నిండి గంతులిడు నసాఫల్యత ఘనత మెరసి నాశనము చేసి జ్యోతిఃకణాళి, కడఁగి వర్షరాత్రుల మిణుగురుల్ పట్టుచుంటి. తే. జీవిత నిశా తమమ్మ! విచిత్ర నీల హిమజలధి వియై యెంత విస్తృతిని గొనుచు వ్యాప్తినొంది - తీ నిర్వికారాత్త చేత నత్వ కిరణము లెన్ని లీనమగుచుండె. తే. ఓసి మాదకతమమ! నీ యొడిని నొదిఁగి యిపుడు నిఖిల భువనము శయించియుండె మూర్తిఁ దాల్చి ప్రతిక్షణపు పరివర్త నమున దాగియుందువు రహస్యముగ నీవు. తే. అమృత సౌభాగ్యవతి తరంగాంకముల లలిత కాశ్మీర రమ్య చూర్ణమ్ము పగిది తరుల కాంతి మమత్వంపు టరుణరేఖ వికసనము నొంది కన్పట్టు విస్ఫుటముగ. ఆంధ్ర కామాయని 15 20 577
పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/577
స్వరూపం