Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/576

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

తే. పరఁగుచు నమాయకముగ నా పర్వతంపు స్వేద జలబిందువులు కొన్ని స్వీకరించి నదులవిగొ ప్రవహించుచున్నవి - స్థిమిత న యనము, విగతశోకక్రోధ మరయ నగము. తే. ఇట్టి ముక్తిని జడత వసించుచుండుఁ దమిని నేఁ గోర నీ జీవితప్రతిష్ఠ కంపన తరంగము అడుగునడుగునందు నగజగమ్ములఁ జుంబించు నట్టి పవన... తే. మటుల, జ్వలన శీలతనొప్పియు యతి గతిమ యుం డయిన యాదినకరుని యొప్పుమీరు మామక మనో నిరాతంక మహితవృత్తి నెల్ల వేళల నొదవ నే నిచ్చగింతు. తే. స్నిగ్ధ రమణీయ మౌ తొలి జీవితంపు గృహము నాత్మతేజమున వెల్గించి, విడిచి తమి గుహా కుంజ వన మరుదంచలముల వెదకుచుంటి నాదు వికాసపదముకొఱకు. తే. ఎవరి నైన నేను గనికరించినానె? వెట్టినై మమత్వమును భంగించినాను ఎవరి కుదారుండ నై సంతసించినాను? ఏ నెవరియెడ స్పర్ధ వహింపలేదు. తే. నాదుకేక యీ విజనాన రోదనమ్ము సేయు - ప్రత్యుత్తరము లేదు - చెలఁగి వాడి పోవునటు చేసి వడగాలి పోల్కి పర్వు లిడెద నా వల్ల నే సుమ మెపుడు విరిసె. తే. శిథిల కల్పనా జగతి వసించు చేను స్వప్న మెయ్యెడ దర్శించువాఁడ నైతి కుసుమ మధుహాస మెన్నఁడే కోర్కె మెరయ సురుచిరత నొప్ప నెయ్యెడఁ జూచినాఁడ! 576 10 వావిలాల సోమయాజులు సాహిత్యం-1